ఆ హీరోని తిట్టొద‍్దు : ‘ఈగ’ విలన్‌ | Sudeepa Request To Fans | Sakshi
Sakshi News home page

Jun 5 2018 10:56 AM | Updated on Aug 25 2018 6:37 PM

Sudeepa Request To Fans - Sakshi

అభిమానుల మూలంగా స్టార్‌ హీరోలకు ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న కామెంట్స్‌ స్టార్స్‌ మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా కన్నడ నటుడు యష్‌ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ ట్రెండ్‌ నడుస్తుంది. సినీ తారలు తన తోటి నటీనటులను చాలెంజ్‌ చేస్తూ ఫిట్‌నెస్‌ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

కన్నడ స్టార్‌ హీరో, ఈగ విలన్‌ సుదీప్‌ తన ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేస్తూ బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌, సోహైల్‌ ఖాన్‌, యష్‌, శివ రాజ్‌కుమార్‌లను చాలెంజ్‌ చేశాడు. ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్‌ చేసిన యష్‌ తన ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. అయితే ఈ వీడియోలో సుదీప్‌ను ఏకవచనంతో సంబోదించటం వివాదాస్పదమైంది. తమ అభిమాన నటుడిని యష్‌ కేవలం సుదీప్‌ అంటూ సంబోందించటంతో ఫ్యాన్స్‌ సీరియస్‌ అయ్యారు. నీ కన్నా పెద్దవారికి మర్యాద ఇవ్వటం నేర్చుకోమంటూ కామెంట్లు చేశారు.

ఈ కామెంట్ల పై స్పందించిన సుదీప్‌, అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. యష్‌ను ఇద్దేశించిన ఎలాంటి అభ్యంతరకర ట్వీట్స్‌ చేయోద్దంటూ కోరారు. యష్ పోస్ట్ చేసిన వీడియోలో నాకు ప్రేమ, మర్యాద మాత్రమే కనిపించాయి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement