క్లీన్‌ చిట్‌ | Subhash Ghai gets clean chit from Mumbai Police | Sakshi
Sakshi News home page

క్లీన్‌ చిట్‌

Dec 9 2018 6:17 AM | Updated on Dec 9 2018 6:17 AM

Subhash Ghai gets clean chit from Mumbai Police - Sakshi

సుభాష్‌ ఘాయ్‌

తనని లైంగికంగా వేధించాడంటూ మోడల్‌ కేట్‌ శర్మ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేశారు. సుభాష్‌ ఘాయ్‌కు ముంబై పోలీస్‌లు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఈ విషయంపై సుభాష్‌ ఘాయ్‌ ఎటువంటి కామెంట్స్‌ చేయనప్పటికీ ఆయన సన్నిహితులు మాట్లాడుతూ –‘‘సుభాష్‌ ఈ ఆరోపణలకు చాలా బాధపడ్డారు. వాళ్ల కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు. పోయిన పేరు, మర్యాద తిరిగి ఎలా వస్తాయి’’ అని ఆవేదనగా అన్నారు. ‘‘ఇచ్చిన కంప్లయింట్‌ అబద్ధం అని తేలినప్పుడు ఆరోపణలు జరిపిన వాళ్లను అరెస్ట్‌ చేయాలి’’ అని పేర్కొన్నారు వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ చీఫ్‌ అడ్వైజర్‌ అశోక్‌ పండిట్‌. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల కేసుని కేట్‌ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత జరిపిన విచారణలో ఎలాంటి ఆధారాలు లేవని సుభాష్‌పై కేసుని కోర్టు కొట్టివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement