మీటు అన్నాక సినిమాలు రాలేదు

Sruthi hariharan React After Metoo Movement - Sakshi

కుటుంబంతో సంతోషంగా ఉన్నా  

నటి శ్రుతి హరిహరన్‌ వెల్లడి  

యశవంతపుర: తనపై జరిగిన లైంగిక వేధింపులపై మీ టూ ద్వారా బహిరంగం చేసినందుకు గర్వంగా ఉందని నటి శ్రుతి హరిహరన్‌ చెప్పారు.  ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక చర్చాగోష్టిలో ఆమె మాట్లాడారు. మీ టు అనడంలో సిగ్గుపడవలసిన పని లేదు. న్యాయపరంగా నా పోరాటం కొనసాగుతోంది. మీ టూ గురించి మాట్లాడినప్పటి నుంచి నాకు సినిమా అవకాశాలు తగ్గాయి. అప్పటి నుంచిఒక్క సినిమా అవకాశం రాలేదు. దీనిపై చింతించబోను. ఏడాది నుంచి భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా. ఈ సారి జాతీయ చలనచిత్ర అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇలాగైనా మళ్లీ నటించే చాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా. మీటూ వంటి విషయాలకు ఎలాంటి సాక్ష్యాలుండవు. కేసును దైర్యంగా ఎదుర్కోవాలి. నాకు జరిగిన అనుభవం మీకు కూడా జరక్కుండా ఉండాలంటే చూస్తూ కూర్చోకండి అని చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top