సీనియర్ హీరోయిన్‌కి గోల్డెన్ ఛాన్స్ | sriya, pairing with rana for bahubali 2 | Sakshi
Sakshi News home page

సీనియర్ హీరోయిన్‌కి గోల్డెన్ ఛాన్స్

Mar 17 2016 8:46 AM | Updated on Aug 11 2019 12:52 PM

సీనియర్ హీరోయిన్‌కి గోల్డెన్ ఛాన్స్ - Sakshi

సీనియర్ హీరోయిన్‌కి గోల్డెన్ ఛాన్స్

టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి...

టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి 2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది.

బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్లో భల్లాలదేవుడిగా నటించిన రానాకు జోడీగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారు. అయితే ఇప్పటివరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement