సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల | Srinu Vaitla Working on Ready 2 Script | Sakshi
Sakshi News home page

సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల

Feb 12 2016 7:54 AM | Updated on Sep 3 2017 5:26 PM

సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల

సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల

వరుస ఫ్లాప్లతో ఢీలా పడిపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు.

వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'ఆగడు' సినిమాతో భారీ డిజాస్టర్ను ఎదుర్కొన్న శ్రీనువైట్ల. ఆ తరువాత 'బ్రూస్ లీ' సినిమాతో మరోసారి ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాడు. దీంతో కాస్త బ్రేక్ తీసుకొని గ్యారెంటీ హిట్తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

కెరీర్ స్టార్టింగ్లో యంగ్ హీరోలతో మంచి సక్సెస్లు సాధించిన శ్రీను మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామాతో తిరిగి సక్సెస్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా రెడీకి సీక్వల్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. మరోసారి రామ్ హీరోగా 'రెడీ'కి సీక్వల్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement