శ్రీకాంత్‌ అడ్డాలతో నాని? | Srikanth addala movie plan to nani? | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ అడ్డాలతో నాని?

Sep 19 2018 1:08 AM | Updated on Sep 19 2018 1:08 AM

Srikanth addala movie plan to nani? - Sakshi

నాని మంచి జోరు మీదున్నారు. సినిమాలతో పెద్ద తెర, ‘బిగ్‌ బాస్‌ 2’తో చిన్ని తెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. నాగార్జునతో కలిసి నాని నటించిన ‘దేవదాస్‌’ ఈ 27న రిలీజవుతుంది. ఇలా ఈ చిత్రం రిలీజవుతుందో లేదో మరో కొత్త చిత్రానికి  ముహూర్తం ఖరారు చేశార ట నాని. ఆల్రెడీ ‘మళ్ళీ రావా’ ఫేమ్‌  గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటించను న్నారు. ఇప్పుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలనుకుంటున్నారట.

‘కొత్త బంగారులోకం’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’  సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్‌ అడ్డాల రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో బ్రహ్మాండమైన కథ తయారు చేశారట. ఆ కథకు నాని హీరో అని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement