శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా | Srihari had no cancer, I can't believe he has gone so suddenly: Prabhudheva | Sakshi
Sakshi News home page

శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా

Oct 11 2013 3:03 PM | Updated on Sep 1 2017 11:34 PM

శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా

శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా

టాలీవుడ్ నటుడు శ్రీహరి అకస్మికమరణాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టాలీవుడ్ నటుడు శ్రీహరి అకస్మికమరణాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల ముందు కూడా ఆయన షూటింగ్లో పాల్గొన్నారని, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉల్లాసంగా గడిపారని చెప్పారు. బుధవారం ముంబైలో హఠాన్మరణం చెందిన శ్రీహరి.. ప్రభుదేవా దర్శకత్వంలో 'ఆర్.. రాజ్కుమార్' సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు.

'శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు ఉక్కు మనిషిగా పేరుంది. నేను పనిచేసిన అత్యంత ఆరోగ్యకరమైన, ఫిట్నెస్ ఉన్న నటుల్లో శ్రీహరి ఒకరు.  ఆయనకు కేన్సర్ ఉన్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ముంబైలో షూటింగ్లో పాల్గొన్నాక ఊహించనివిధంగా అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో చనిపోయారు' అని ప్రభుదేవా చెప్పారు. ఆయన హైదరాబాద్ వచ్చి శ్రీహరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement