పెదవి విప్పితేనే తెలుస్తుంది? | Sridevi Looks Unrecognizable In Viral Video! Clear Case Of Botched Up Surgery? | Sakshi
Sakshi News home page

పెదవి విప్పితేనే తెలుస్తుంది?

Jan 26 2018 1:35 AM | Updated on Jan 26 2018 1:35 AM

Sridevi Looks Unrecognizable In Viral Video! Clear Case Of Botched Up Surgery? - Sakshi

మూడు రోజుల క్రితం శ్రీదేవి ఇలా కనిపించారు

శ్రీదేవి పెదాలకు ఏమైంది? అవును ఏమైంది? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇదే చర్చ. సెలబ్రిటీల విషయంలో  కాదేదీ చర్చకు అనర్హం. ఇటీవల దర్శకుడు అనురాగ్‌ బసు నిర్వహించిన సరస్వతి పూజకు శ్రీదేవితో పాటు పలువురు బాలీవుడ్‌ తారలు హాజరయ్యారు. అక్కడ శ్రీదేవి పెదాలను చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారట. ఎందుకంటూ ఆమె పెదాలు ఉబ్బి, కనిపించాయట.

దాంతో శ్రీదేవి పెదాలకు సర్జరీ చేయించుకున్నారా? అనే వార్తలు మొదలయ్యాయి. పెదాల షేప్‌ బాగా లేకపోవడంతో సర్జరీ వికటించిందని కూడా చెప్పుకుంటున్నారు. దీని గురించి శ్రీదేవి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందరూ ఊహిస్తున్నట్లు సర్జరీ జరిగి ఉంటుందా? లేక ఆరోగ్యం బాగాలేకపోవడంవల్ల శ్రీదేవి లిప్స్‌ అలా తయారయయ్యాయా? అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఆ సంగతలా ఉంచితే కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ అప్పుడు కూడా శ్రీదేవి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ విషయం పై శ్రీదేవి స్పందిస్తూ – ‘‘అందంగా కనిపించటానికి సర్జరీలు చేయించుకోలేదు. నేను సిస్టమాటిక్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తాను. పవర్‌ యోగా, టెన్నిస్‌ ఆడుతుంటాను. కొన్నిసార్లు అపియరెన్స్‌లో తేడా కనిపిస్తుంది. అంత మాత్రాన సర్జరీలు చేయించుకున్నారంటే ఎలా’’ అన్నారు. ఇప్పుడూ కేవలం అపియరెన్స్‌లో తేడానా? లేక సర్జరీనా? అనే విషయం పై శ్రీదేవి క్లారిటీ ఇస్తేనే వ్యవహారం సద్దుమణుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement