శ్రీవిష్ణుతో బిచ్చగాడు బ్యూటీ | Sri Vishnu new movie teaser on jan6th | Sakshi
Sakshi News home page

6న 'నీది నాది ఒకే కథ' టీజర్‌

Jan 1 2018 12:37 PM | Updated on Aug 9 2018 7:30 PM

Sri Vishnu new movie teaser on jan6th - Sakshi

'మెంటల్‌ మదిలో' చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజగా నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో  'నీది నాది ఒకే కథ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన రాగా తాజగా టీజర్‌ విడుదలకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

టీజర్‌ను జనవరి 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు స్నేహితుడు నారారోహిత్‌ అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement