మాటలు మర్యాదగా రాలేదో.. : శ్రీరెడ్డి

Sri reddy FB Post Against A Woman Producer In Tollywood - Sakshi

హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పలువురిపై ట్వీట్స్‌, పోస్ట్‌లతో నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తీరును తప్పుపట్టిన టాలీవుడ్‌కు చెందిన ఓ మహిళపై శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టాలీవుడ్‌లో కొన్ని నెలల కిందట కలకలం రేపిన డ్రగ్స్‌ కేసుతో పాటు వ్యభిచారం లాంటి విషయాల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘మేడం. ఓ మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాను. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. నిర్మాతగా మూవీలు చేశారు. మీకు మా సమస్యలు తెలియవు. మాటలు మర్యాదగా రాకపోతే నేను తట్టుకోలేను. మీ ఇష్టానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పడేవారు లేరు. కో ఆర్డినేటర్స్‌ ఎంత దారుణంగా వ్యవహరిస్తారో తెలుసా. మహిళలను అలాంటి వాటిలోకి ఎలా దింపుతారో తెలుసు. సినీ ఇండస్ట్రీకి నార్త్‌ ఇండియన్ అమ్మాయిలను పరిచయం పరిచయం చేసి, ఇంట్లో ఉంచుకున్న ఆ కల్చర్‌ తెచ్చింది మీరే. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో మంచి హోదాలో ఉన్నా.. ఇలా ప్రవర్తించడం బాగోలేదు. తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్‌ చేయాలని’ కోరుతూ నటి శ్రీరెడ్డి ఓ వీడియో పోస్ట్‌ చేశారు.


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top