స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..! | Spyder teaser launch postponed | Sakshi
Sakshi News home page

స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..!

May 31 2017 10:48 AM | Updated on Sep 5 2017 12:28 PM

స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..!

స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ను బుధవారం సాయంత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్ను చిత్రయూనిట్ వాయిదా వేశారు.

ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ను రిలీజ్ చేస్తుంటారు. అయితే దాసరి మరణంతో కృష్ణ తన పుట్టిన రోజు వేడుకలు చేయవద్దని అభిమానులను కోరారు. అదే సమయంలో మహేష్ కూడా స్పైడర్ టీజర్ను ఒక రోజు వాయిదా వేశారు. స్పైడర్ టీజర్ గురువారం(01-06-2017) ఉదయం 10.30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement