స్పైడర్.. సడన్ సర్ప్రైజ్ | spyder mass song and trailer released | Sakshi
Sakshi News home page

స్పైడర్.. సడన్ సర్ప్రైజ్

Sep 15 2017 3:23 PM | Updated on Sep 19 2017 4:36 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్.. అభిమానులకు ఓ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. టీజర్ ను ముందుగానే ఎనౌన్స్ చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్  మధ్య రిలీజ్ చేసిన మూవీ టీం, ట్రైలర్ రిలీజ్ ను మాత్రం కేవలం ఒక గంట ముందే వెల్లడించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్రైలర్ తో పాటు ‘అక్కడ ఉన్నాడు అనే’ మాస్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా గీత మాధురి ఆలపించారు.

మహేష్ క్యారెక్టరైజేషన్ తో పాటు సినిమా థీమ్ ను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. ఇప్పటికే భారీ  అంచనాలు ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇప్పటికే చెన్నైలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించగా ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement