నాలుగు శతాబ్దాల కథ! | Sakshi
Sakshi News home page

నాలుగు శతాబ్దాల కథ!

Published Sun, Jul 16 2017 12:43 AM

నాలుగు శతాబ్దాల కథ!

చరిత్ర చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే హిస్టారికల్‌ మూవీస్‌కి స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శతాబ్దాల నేపథ్యంలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రం రూపొందింది. ఈ నాలుగు శతాబ్దాల చరిత్రలో బయటి ప్రపంచానికి తెలియని ఓ చీకటి కోణం ఈ చిత్రానికి ప్రధానాంశం. సూర్య దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మిస్తున్నారు.


పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, సాయికుమార్‌ ముఖ్యతారలు. సూర్య మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. కాలాలకు అనుగుణంగా డిఫరెంట్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. నాటి తరాలకు, ఇప్పటి తరానికి మధ్య తేడాను చూపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. చిత్రీకరణ పూరై్తంది. హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా గ్రాఫిక్‌ వర్క్స్‌ చేయిస్తున్నాం. త్వరలో సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌.

Advertisement
Advertisement