ఇక సినిమాలకు గుడ్ బై..? | south actress saranya married no more films | Sakshi
Sakshi News home page

ఇక సినిమాలకు గుడ్ బై..?

Sep 8 2015 12:56 PM | Updated on Sep 3 2017 9:00 AM

ఇక సినిమాలకు గుడ్ బై..?

ఇక సినిమాలకు గుడ్ బై..?

వినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన, కేరళ కుట్టి శరణ్య మోహన్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, తరువాత సౌత్ ఇండస్డ్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

వినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన, కేరళ కుట్టి శరణ్య మోహన్.. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, తరువాత దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్ రోల్స్తో పాటు చెల్లెలి పాత్రల్లో కూడా అలరించిన ఆమె ఇక సినిమాలకు గుడ్బై చెప్పేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది.

ఈ మధ్యే కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అరవింద్ కృష్ణన్ ను పెళ్లాడిన శరణ్య.. సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుందట. అయితే స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్, సింగర్ అయిన శరణ్య ఆ రంగాల్లో తన కెరీర్ ను కంటిన్యూ చేయాలనుకుంటుంది. మరి శరణ్య అనుకున్నట్టుగా సినిమాలకు దూరమవుతుందో లేక అందరూ హీరోయిన్ల లాగే లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement