ఆకాశమే హద్దు | Soorarai Pottru first look release | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దు

Nov 11 2019 6:14 AM | Updated on Nov 11 2019 6:14 AM

Soorarai Pottru first look release - Sakshi

సూర్య

‘ఆకాశమే నీ హద్దురా.. ఎవరు ఆపినా ఆగొద్దురా’ అంటున్నారు సూర్య. అనడమే కాదు.. ఆకాశానికి ఎగరడానికి ప్రయత్నిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది.

‘అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ’ అన్నది ట్యాగ్‌లైన్‌. సూర్య నటిస్తూ, నిర్మిస్తున్నారు. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో  మారా అనే పైలెట్‌ పాత్రలో సూర్య కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆదివారం విడుదల చేశారు.  అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీప్రకాశ్‌ కుమార్, కెమెరా: నికేత్‌ బొమ్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement