ట్రైలర్‌కు బదులుగా ఫుల్‌ మూవీ అప్‌లోడ్‌.. | Sony Pictures Uploads Movie Link Instead Of Other Movie | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌కు బదులుగా ఫుల్‌ మూవీ అప్‌లోడ్‌..

Published Wed, Jul 4 2018 2:27 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Sony Pictures Uploads Movie Link Instead Of Other Movie - Sakshi

సాధారణంగా సినిమా విడుదలకు ముందు ట్రైలర్లు, టీజర్లు లాంటివి ప్రమోట్‌ చేయడం చూస్తుంటాం. అయితే సోని పిక్చర్స్‌ వారు చేసిన పనికి ఏకంగా నెటిజన్లు మొత్తం సినిమానే హాయిగా వీక్షించారు. రెడ్‌ బ్యాండ్‌ మూవీ ట్రైలర్‌ లింక్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాల్సి ఉండగా.. జాన్‌ మథ్యూస్‌ దర్శకత్వం వహించిన ‘ఖాళీ ద కిల్లర్‌’  మూవీ లింక్‌ను సోని సంస్థ పొరపాటున షేర్‌ చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్‌నెట్‌లో మూవీని చూసిన ఉత్సాహంలో కొందరు సోనీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి.

ఇది గమనించిన నెటిజన్లు ఎంచక్కా మూవీని డౌన్‌లోడ్‌ చేసుకుని చూశారు. హాలీవుడ్‌ రిపోర్టర్‌ అయితే 89 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న మూవీని సోని పిక్చర్స్‌ యూట‍్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు వెల్లడించారు. దాదాపు 8 గంటలపాటు మూవీ ఆన్‌లైన్‌లో ఉండగా, కొందరు నెటిజన్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

‘హహహ.. సోని సంస్థ ఖాళీ ద కిల్లర్‌ మూవీ ట్రైలర్‌ను అప్‌లోడ్‌ చేయాలనుకుంది. అయితే పొరపాటున మూవీ లింక్‌ను పోస్ట్‌ చేసింది. హహహ నేను ఆ మూవీ మొత్తం చూశాను’ అని రాకో బాట్టే అనే ట్విటర్‌ ఫాలోయర్‌ అందుకు సంబంధించిన ఫొటోను తన పోస్ట్‌లో షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement