త్రిష చెబితే ఓకే | sonia agarwal respects trisha's decision | Sakshi
Sakshi News home page

త్రిష చెబితే ఓకే

Nov 17 2013 4:16 AM | Updated on Sep 2 2017 12:40 AM

స్నేహానికి మించింది సృష్టిలో మరొకటి లేదంటారు. నటి త్రిషకు తనకు మధ్య ఉన్నది అలాంటి స్నేహమే నంటోంది నటి సోనియా అగర్వాల్.

 తమిళసినిమా, న్యూస్‌లైన్: స్నేహానికి మించింది సృష్టిలో మరొకటి లేదంటారు. నటి త్రిషకు  తనకు మధ్య ఉన్నది అలాంటి స్నేహమే నంటోంది  నటి సోనియా అగర్వాల్. ఆ మధ్య కాదల్  కొండేన్, 7జి రెయిన్‌బో కాలనీ, తిరుట్టు పయలే తదితర చిత్రాల విజయాలతో వెలిగిపోయిన ఈ  పంజాబీ భామ, దర్శకుడు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లాడి, విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా  జీవనం సాగిస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్‌లో అందాలారబోసిన ఈ భామ  మాట్లాడుతూ సినీ రంగంలో తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లి ప్రోత్సాహమే  కారణమంది. ఏ విషయాన్ని అయినా ఆమెతో పంచుకుంటానని చెప్పింది.
 
  ప్రస్తుతం తన తల్లి చంఢీగడ్‌లో ఉందని తెలిపిం ది. అయినా ప్రతిరోజు కనీసం ఐదు గంటలు  ఆమెతో మాట్లాడుతానని చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాల్లో బాగా నచ్చింది 7జీ  బృందావన్ కాలనీ అని పేర్కొంది. ఆ చిత్రంలోని పాత్ర తన జీవితానికి దగ్గరగా ఉండేట్లు  అమరిందని చెప్పింది. ఈ రంగంలో తనకు త్రిష, వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి స్నేహితులని  చెప్పింది. వారిద్దరూ ఏమి చెప్పి నా గుడ్డిగా నమ్మేస్తానంది. తనకు ఆత్మస్థైర్యం ఇచ్చి నటిగా  మార్చింది తమిళ సినిమానేనని పేర్కొంది. తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని  వాటినన్నింటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తమిళ సినిమానే ఇచ్చిందని సోని యా అగర్వాల్  పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement