నిర్మాతగా సోనమ్‌

Sonam Kapoor debuts as producer with international documentary on global warming - Sakshi

భూతాపం ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. దీనిపై ప్రపంచ దేశాలు సదస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. అందుకే ఓ డాక్యుమెంటరీని తీయాలని నిర్ణయించుకుని, నిర్మాతగా మారారు. ఈ డాక్యుమెంటరీలో సోనమ్‌ కూడా నటిస్తారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఐదుగురు డైరెక్టర్స్‌ ఈ డాక్యుమెంటరీ కోసం వర్క్‌ చేస్తారట. దీనికోసం ఇండియా, యూరప్, ఆస్ట్రేలియా, యూఎస్‌ దర్శకులను వెతికే పనిలో పడ్డారట సోనమ్‌ అండ్‌ టీమ్‌. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారని సమాచారం. సింగపూర్‌ బేస్డ్‌ రచయిత కృష్ణ ఉదయశంకర్‌ రాసిన ‘ఆర్యావర్తా క్రానికల్స్‌’ బుక్‌ రైట్స్‌ని కూడా సోనమ్‌ దక్కించుకున్న సంగతి తెలిసందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top