సోనమ్‌-ఆనంద్‌ల పెళ్లి ఫిక్స్‌ | Sonam Kapoor And Anand Ahuja Wedding Officially Confirmed | Sakshi
Sakshi News home page

May 2 2018 11:26 AM | Updated on May 2 2018 12:13 PM

Sonam Kapoor And Anand Ahuja Wedding Officially Confirmed - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ సోనమ్‌ కపూర్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాల వివాహం ఖాయమైనట్లు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించేశాయి. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్లకు తెరపడింది. మే 8న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు కపూర్‌ సపరివారమంతా హాజరుకానుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను షెడ్యుల్‌ కూడా చేశారని సమాచారం. 

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫర్హా ఖాన్‌ సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సంగీత్‌లో జాన్వీ కపూర్‌, కరణ్‌ జోహర్‌, రణబీర్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌లు పాల్గొంటారు. ఆట పాటలతో సంగీత్‌ కార్యక్రమాన్ని అలరించబోతున్నారు. బాలీవుడ్‌ తారాగణం అంతా ఈ పెళ్లికి తరలిరాబోతున్నారు. పెళ్లి శుభలేఖలను ముద్రించకుండా... పేపర్‌ వేస్టేజ్‌ను తగ్గించే పనిలో భాగంగా... ఈ-వెడ్డింగ్‌ కార్డును ఉపయోగిస్తున్నారని బీ టౌన్‌ అంటోంది. ప్రస్తుతం సోనమ్‌ ‘వీరే దీ వెడ్డింగ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే జరగబోయే కేన్స్‌ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై సోనమ్‌ నడవనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement