ప్రత్యేక పాటకు రెండున్నర కోట్లు! | Sonakshi Sinha's 2.5 crore item song in 'Tevar' | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పాటకు రెండున్నర కోట్లు!

Feb 8 2014 11:43 PM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రత్యేక పాటకు రెండున్నర కోట్లు! - Sakshi

ప్రత్యేక పాటకు రెండున్నర కోట్లు!

క్రేజ్ ఉన్నవాళ్లు కోరుకున్నంత అన్న చందంగా బాలీవుడ్ తయారయ్యింది. అందుకు ఉదాహరణ ‘తేవర్’ చిత్రంలోని ఐటమ్ సాంగ్.

 క్రేజ్ ఉన్నవాళ్లు కోరుకున్నంత అన్న చందంగా బాలీవుడ్ తయారయ్యింది. అందుకు ఉదాహరణ ‘తేవర్’ చిత్రంలోని ఐటమ్ సాంగ్. మహేష్‌బాబు, భూమిక జంటగా నటించిన ‘ఒక్కడు’కి రీమేక్ ఇది. అర్జున్‌కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేక గీతానికి కాలు కదపమని సోనాక్షీ సిన్హాని కోరారట చిత్ర నిర్మాత బోనీకపూర్. ‘చేస్తా కానీ.. రెండున్నర కోట్లు ఇస్తేనే’ అని డిమాండ్ చేశారట ఈ ముద్దుగుమ్మ. మాస్ పాటలకు సోనాక్షి బాగా డాన్స్ చేస్తారు కాబట్టి, ఆమె అడిగినంత ఇవ్వడానికి బోనీ అంగీకరించేశారట. ఆ పాట కోసం భారీ సెట్ కూడా వేయించారట. ఈ పాటకు సాజిద్-వాజిద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని బోనీ తెలిపారు. ఇటీవలే ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాట కోసం సోనాక్షి ధరించిన కాస్ట్యూమ్స్ ఖరీదు 75 లక్షల రూపాయలట. ఇక.. పాట ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement