అకీరాగా సోనాక్షి అదుర్స్ | Sonakshi Sinha Akira movie Trailer | Sakshi
Sakshi News home page

అకీరాగా సోనాక్షి అదుర్స్

Jul 5 2016 12:47 PM | Updated on Sep 4 2017 4:11 AM

అకీరాగా సోనాక్షి అదుర్స్

అకీరాగా సోనాక్షి అదుర్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎమోషనల్ డ్రామాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటే.., స్టార్ వారసురాలు...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎమోషనల్ డ్రామాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటే.., స్టార్ వారసురాలు సోనాక్షి సిన్హా మాత్రం యాక్షన్ అవతార్లో అదరగొడుతోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా అకీరా. సోనాక్షి సిన్మా లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

పూర్తిగా సోనాక్షిని యాక్షన్ స్టార్గా ప్రజెంట్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన 15 గంటల్లో దాదాపు 9 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ ట్రైలర్ను వీక్షించారు. తమిళ్లో ఘనవిజయం సాధించిన మౌనగురు సినిమాలోనే హీరో పాత్రను లేడీ క్యారెక్టర్గా మార్చి... మురుగదాస్, ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement