ఆరు పలకల దేహంతో సుధీర్‌బాబు
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అక్కణ్ణుంచి టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్ ఫీవర్ పట్టుకుంది. పాత్ర డిమాండ్ చేస్తే చాలు.. మన హీరోలు సిక్స్ ప్యాక్ చేయడానికి వెనకాడటంలేదు.
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అక్కణ్ణుంచి టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్ ఫీవర్ పట్టుకుంది. పాత్ర డిమాండ్ చేస్తే చాలు.. మన హీరోలు సిక్స్ ప్యాక్ చేయడానికి వెనకాడటంలేదు. ఇప్పుడీ జాబితాలో సుధీర్‌బాబు చేరారు. ఎస్‌ఎమ్‌ఎస్, ప్రేమకథా చిత్రమ్ సినిమాల విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు ప్రస్తుతం ‘ఆడు మగాడ్రా బుజ్జి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులోనే సుధీర్‌బాబు ఆరు పలకల దేహంతో కనిపించబోతున్నారు.
ఎస్. పద్మజ సమర్పణలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. శ్రీ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ నెలలోనే పాటలను, సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కథ, కథనం, సుధీర్‌బాబు చేసిన ఫైట్స్ విశేషంగా ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది. క్లాస్, మాస్ అనే లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు.