ఆమె స్పెషల్ లేడీ: మెగాస్టార్ | Smita Patil was a special lady, says Big B | Sakshi
Sakshi News home page

ఆమె స్పెషల్ లేడీ: మెగాస్టార్

Oct 18 2016 3:28 PM | Updated on Sep 4 2017 5:36 PM

ఆమె స్పెషల్ లేడీ: మెగాస్టార్

ఆమె స్పెషల్ లేడీ: మెగాస్టార్

అలనాటి బాలీవుడ్ నటి స్మితా పాటిల్ 'స్పెషల్ లేడీ' అంటూ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు.

ముంబై: అలనాటి బాలీవుడ్ నటి స్మితా పాటిల్ 'స్పెషల్ లేడీ' అంటూ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. స్మితా 61వ జయంతి సందర్భంగా అమితాబ్ ఆమెను స్మరించుకున్నారు.

స్మితాతో కలసి శక్తి, నమక్ హలల్ సినిమాల్లో నటించానని అమితాబ్ పేర్కొన్నారు. స్మితా స్పెషల్ లేడీ, వివేకవంతమైన స్నేహితురాలు.. అంటూ ట్వీట్ చేశారు. 1980ల్లో స్మితా అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. కేవలం దశాబ్దకాలం కెరీర్లో 80కి పైగా సినిమాల్లో నటించారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో నటించారు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు పద్మశ్రీ అందుకున్నారు. మంతన్, భూమిక, ఆక్రోశ్, చక్ర, చిదంబరం, మిర్చ్ మసాలా వంటి హిట్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్బబ్చర్ను వివాహం చేసుకున్న స్మితా 31వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమారుడు ప్రతీక్ నటుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement