తమన్నాతో విదేశాల్లో విక్రమ్‌ | Sketch is the latest film in which Vikram is the hero. | Sakshi
Sakshi News home page

తమన్నాతో విదేశాల్లో విక్రమ్‌

May 23 2017 2:22 AM | Updated on Sep 5 2017 11:44 AM

తమన్నాతో విదేశాల్లో విక్రమ్‌

తమన్నాతో విదేశాల్లో విక్రమ్‌

విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్‌.

విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్కెచ్‌. ఇరుముగన్‌ చిత్రం సంచలన విజయం సాధించిన తరువాత ఆయన నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్‌తో మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా రొమాన్స్‌ చేస్తున్న చిత్రం స్కెచ్‌. ఇంతకు ముందు శింబు హీరోగా వాలు చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. పులి, ఇరుముగన్‌ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శిబుతమీన్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం స్కెచ్‌.

శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్, తమన్నాల రొమాంటిక్‌ లవ్‌ సన్నివేశాలను పాండిచ్చేరిలో చిత్రీకరించారట. ఇక విక్రమ్‌ నటించే మాస్‌ సాంగ్‌ కోసం చెన్నైలోని బిన్నీమిల్లులో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించనున్నారట. అలాగే విక్రమ్, తమన్నాల డ్యూయెట్‌ సాంగ్‌ను విదేశాల్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ స్కెచ్‌ వేసినట్లు సమాచారం. ఇందులో విక్రమ్‌ బైక్‌ల దొంగగా నటిస్తుండగా ఆయనకు ప్రేయసిగా మిల్కీబ్యూటీ నటిస్తున్నారట. ఇంతకు ముందు చిత్రాల్లో తెగ అందాలను ఆరబోసిన ఈ అమ్మడు స్కెచ్‌లో హోమ్లీ పాత్రలో చూడవచ్చునంటున్నాయి చిత్ర వర్గాలు. చూద్దాం ఈ తరహా పాత్రలో తమన్నా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement