రెమో కోసం నవ్వొద్దు | Sivakarthikeyan's 'Remo' Music Album | Sakshi
Sakshi News home page

రెమో కోసం నవ్వొద్దు

Aug 17 2016 1:16 AM | Updated on Sep 4 2017 9:31 AM

రెమో కోసం నవ్వొద్దు

రెమో కోసం నవ్వొద్దు

రెమో చిత్రం కొసం నవ్వొద్దు అనగానే ఏదేదో ఊహించుకుంటున్నారా? చాలా భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చిత్రం రెమో.

 రెమో చిత్రం కొసం నవ్వొద్దు అనగానే ఏదేదో ఊహించుకుంటున్నారా? చాలా భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చిత్రం రెమో. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఆయనకు జంటగా కీర్తీసురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. 24 ఎఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఒక మీడియో ఆల్బమ్‌ను తయారు చేశారు. అందులో పాట పల్లమే సిరిక్కాదే(నవ్వొద్దే). అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు ఇదే చిత్ర నిర్మాత నివీన్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర దర్శకుడు రాధాకృష్ణన్ కాన్సెప్ట్‌ను తమారు చేశారు.
 
 అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్ పాడిన ఈ పాటలో శివకార్తికేయన్, కీర్తీసురేశ్, సంగీతదర్శకుడు అనిరుద్, గాయకులు అర్జున్ కనుంగ, శ్రీనిధి వెంకటేశ్, ఇన్నో చెంగ, యరియ, శశాంక్, విజయ్, కెబజెరిమియా నటించారు. ఈ ప్రచార మ్యూజిక్ వీడియోను తమిళం,ఆంగ్లం భాషల్లో రూపొందించారు. తమిళ వెర్షన్‌ను ఈ నెల 18 సాయంత్రం ఆరు గంటలకు సోనీ చానల్ వైటీ, ట్విట్టర్ ద్వారాను విడుదల చేయనున్నారు. ఒక వారం తరువాత ఆంగ్ల మ్యూజిక్ వీడియోను ఎంటీవీ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement