ఆయన జెంటిల్‌మేన్‌

Simran chating on her Tweeter Fans - Sakshi

‘నిన్నా కుట్టేసినాది... మొన్నా కుట్టేసినాది గండు చీమ...’ పాటలో ఎలా కనిపించారో  సిమ్రాన్‌ ఇప్పటికీ అలానే ఉన్నారు. కధానాయికగా భేష్‌ అనిపించుకున్న ఆమె ఇటీవల ‘సీమరాజా’ సినిమాలో తన విలనిజమ్‌ని కూడా చూపించి, ప్రశంసలు పొందారు. అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ట్వీటర్‌లో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా తన ఫ్యాన్స్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు సిమ్రాన్‌ సమాధానం చెప్పారు. అందులో కొన్ని...

► మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు కనిపిస్తారు?
మంచి రోల్‌ వస్తే తప్పకుండా.. త్వరలోనే.

► మీ డ్యాన్స్‌కు పెద్ద అభిమానులం. మీరు డ్యాన్స్‌ చేసిన వాటిలో మీకు నచ్చిన పాట?
‘జోడీ’ సినిమాలో పాటలు నాకు పర్సనల్‌గా ఇష్టం.

► నటిగా మీకు సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏది?
‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో పాత్ర చాలా సంతృప్తినిచ్చింది.

► ‘పేట్టా’లో రజనీకాంత్‌తో నటించడం ఎలా ఉంది?
ఈ సినిమా ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌. రజనీ సార్‌ జెంటిల్‌మేన్‌.

► అప్పటి, ఇప్పటి దర్శకులతో పని చేశారు. వాళ్లలో మీరు గమనించిన తేడా ఏంటి?
ఎటువంటి తేడా లేదు.

► తమిళంలో ‘సీమరాజా’  సినిమాలో నెగటీవ్‌ పాత్ర చేశారు. వాటిని కొనసాగిస్తారా?
పవర్‌ఫుల్‌ రోల్స్‌ వస్తే తప్పకుండా చేస్తా.

► మీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ చెబుతారా?
క్రమశిక్షణతో ఉండటం. అన్ని పనులు టైమ్‌కి చేయడమే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌.

► దర్శకురాలిగా ఎప్పుడు మారుతున్నారు?
నాకు ఇంకా నటించాలని, ఇంకా నేర్చుకోవాలని ఉంది. సినిమాలు సముద్రంలాంటివి. ఎన్ని నేర్చుకున్నా ఇంకా మిగిలున్నట్లే ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top