అత్తారింటికి దారేది.. దించేశారు | Simbu Tamil Remake Of Attarintiki Daredi Teaser Released | Sakshi
Sakshi News home page

Dec 1 2018 5:31 PM | Updated on Dec 1 2018 6:27 PM

Simbu Tamil Remake Of Attarintiki Daredi Teaser Released - Sakshi

తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కోలీవుడ్‌లో ‘వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్’  పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలగులో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. ఈ సినిమా తమిళ్‌ రీమేక్‌లో పవన్‌కల్యాణ్‌ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్‌, కేథరిన్‌ థెరీసా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుందర్‌.సి దర్శకుడు. లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది.   

తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఫన్, సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌తో తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన అత్తారింటికి దారేది.. విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. ‘వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్’  టీజర్‌లోనూ అవే ఎలిమెంట్స్‌తో, కథ కథనంలో ఎలాంటి మార్పులు చేయకుండానే చిత్రాన్ని తెరకెక్కిచ్చినట్టు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులోని సీన్స్‌ చాలా భాగం తెలుగు వర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్ర‌భు, నాజ‌ర్‌, యోగిబాబు, మోట్టా రాజేంద్ర‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement