అతిథిలా వచ్చాడు

 Simbu to share screen space with Jyothika in Kaatrin Mozhi - Sakshi

రేడియో జాకీగా రేడియో స్టేషన్‌లో ఫుల్‌ బిజీగా యాంకరింగ్‌ చేస్తున్నారు జ్యోతిక. ఇంతలో అక్కడికి శింబు గెస్ట్‌గా వచ్చారు. వెంటనే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోయింది. ఇదంతా తమిళ చిత్రం ‘కాట్రిన్‌ మొళి’ కోసమే. జ్యోతిక ప్రధాన పాత్రలో హిందీ హిట్‌ చిత్రం ‘తుమ్హారీ సులు’ రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. దానికి సంబంధించిన సీన్స్‌ను రీసెంట్‌గా షూట్‌ చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక బాస్‌ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనున్నారు. రాధామోహన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top