సిద్దూ.. మళ్లీ బిజీ అవుతున్నాడు | Siddharth next movie Shaitan ka bacha | Sakshi
Sakshi News home page

సిద్దూ.. మళ్లీ బిజీ అవుతున్నాడు

Jun 2 2016 9:21 PM | Updated on Sep 4 2017 1:30 AM

సిద్దూ.. మళ్లీ బిజీ అవుతున్నాడు

సిద్దూ.. మళ్లీ బిజీ అవుతున్నాడు

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్దార్థ్ తరువాత వరుస ఫ్లాప్లతో ఢీలా పడిపోయాడు. టాలీవుడ్లో హిట్ దొరక్కపోవటంతో...

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్దార్థ్ తరువాత వరుస ఫ్లాప్లతో ఢీలా పడిపోయాడు. టాలీవుడ్లో హిట్ దొరక్కపోవటంతో చెన్నై ఫ్లైట్ ఎక్కిన సిద్దూకి అక్కడ కూడా నిరాశే మిగిలింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మకంగా తెరకెక్కిన కావ్య తలైవన్, ఎనక్కుల్ ఒరువన్ లాంటి సినిమాలు కూడా నిరాశే మిగిల్చాయి.

చివరకు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన జిల్ జంగ్ జక్ కూడా సిద్దూను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్, కెరీర్ పరంగానే కాక ఆర్థికంగా కూడా సిద్థార్థ్కు నష్టాలనే మిగిల్చింది. దీంతో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు సిద్దార్ధ్. ఇంతకాలం సరైన కథ కోసం ఎదురుచూసిన ఈ చాక్లెట్ బాయ్ ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల పాండవుల్లో ఒకడు సినిమాతో సక్సెస్ సాధించిన కార్తీక్ క్రిష్ దర్శకత్వంలో సైతాన్ కా బచ్చా పేరుతో సినిమా ప్రారంభిస్తున్నాడు. అంతేకాదు బిచ్చగాడు సినిమాతో సంచలన విజయం సాధించిన శశి దర్శకత్వంలో జివి ప్రకాష్తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. మళయాల హీరో దిలీప్తో కలిసి మరో మల్టీ స్టారర్కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న  భారీ బడ్జెట్ సినిమాలో ప్రధాన పాత్రకు రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement