ఎక్స్‌క్యూజ్‌ మీ రాక్షసి..

Siddharth lends his voice for Sundeep Kishan's next - Sakshi

... అని సందీప్‌ కిషన్‌ హీరోయిన్‌ను బుజ్జగిస్తుంటే.. హీరో సిద్ధార్థ్‌ కొంచెం పాట సాయం చేశారు. సందీప్‌ కిషన్‌ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్‌ హీరోయిన్‌. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిల్‌ సుంకర సమర్పకులు. దయా మన్నెం, విజి సుబ్రహ్మణ్యన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘ఎక్స్‌క్యూజ్‌ మీ రాక్షసి..’ అంటూ సాగే ఓ పాటను సిద్ధార్థ్‌ ఆలపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంతో తెలుగు మరింత తీయగా ఉంటుంది. నటుడిగా నాకు గుర్తింపు, స్టార్‌డమ్‌ ఇచ్చింది తెలుగు సినిమానే. అందుకే తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రత్యేకాభిమానం.

సందీప్‌ కిషన్‌ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ పాట పాడాను’’ అన్నారు. ‘‘ఇదో ఫన్‌ ఎనర్జిటిక్‌ సాంగ్‌. సిద్ధార్థ్‌గారి వాయిస్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. యాక్టర్‌గా నా తొలిరోజుల్లో చాలా సపోర్ట్‌ చేశారు. నా నిర్మాణంలో వస్తున్న ఫస్ట్‌ సినిమాకి తనతో అసోసియేట్‌ అవ్వడం సంతోషం’’ అన్నారు సందీప్‌ కిషన్‌. ‘‘సిద్ధార్థ్‌ నిర్మించిన తొలి సినిమాకు, సందీప్‌ నిర్మిస్తున్న తొలి సినిమాకు నేనే సంగీతం దర్శకుడిని కావడం విశేషం. ఇద్దరూ నాకు మంచి స్నేహితులే’’ అన్నారు తమన్‌. ‘‘పాట రాస్తున్నప్పుడే సిద్ధార్థ్‌గారు పాడితే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ రాశాను. ఆయన పాడిన ప్రతి పాట బ్లాక్‌బస్టర్‌. ఈ పాట కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రచయిత సామ్రాట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top