'శ్రుతి సంతకమే తరువాయి' | Shruti Haasan joins 'Singam 3' | Sakshi
Sakshi News home page

'శ్రుతి సంతకమే తరువాయి'

May 16 2015 12:23 PM | Updated on Sep 3 2017 2:10 AM

'శ్రుతి సంతకమే తరువాయి'

'శ్రుతి సంతకమే తరువాయి'

కొత్త సినిమాల్లో నటించే విషయమై కోర్టు వివాదాలు పూర్తిగా సమసిపోయిన నేపథ్యంలో నటి శ్రుతిహాసన్ ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది.

కొత్త సినిమాల్లో నటించే విషయమై కోర్టు వివాదాలు పూర్తిగా సమసిపోయిన నేపథ్యంలో నటి శ్రుతిహాసన్ ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సింగం, సింగం 2 కు సీక్వెల్ గా వస్తోన్న సింగం 3 సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపింది. హీరో సూర్యకు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన సింగం, సింగం 2 తరహాలోనే మూడో సీక్వెల్ నూ పూర్తిస్థాయి యాక్షన్ మాస్ మసాలాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు దర్శకుడు హరి.

అనుష్క ప్రధాన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను తీసుకున్నాం. ఇందుకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. అగ్రిమెంట్ పేపర్లమీద  శ్రుతి హాసన్ సంతకం చేయడమే మిగిలింది' అని సింగం ఫ్రాంచైంజీ అధికార ప్రతినిధి మీడియాతో అన్నారు. అయితే సింగం సీక్వెల్‌గా సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ కాకుండా సింగం-3కి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందించనున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న సింగం 3 వచ్చే సంక్రాంతికి విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement