breaking news
Singam 3 movie
-
కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి బాటలో తేజస్విని
కోలీవుడ్ దివంగత ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబంలో శుభకార్యం జరిగింది. ఆయన కూతురు పెళ్లి చెన్నైలోని తన నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. 2021 ఏప్రిల్‌లో గుండెపోటుతో వివేక్ మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించారు. శివాజీ, సింగం, సింగం-2, విశ్వాసం,రఘువరన్ బీటెక్ చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. మార్చి 28 వివేక్ కూతురు తేజస్విని ఏడు అడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. భరత్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం వద్ద పద్మావతి నగర్లో ఉన్న వివేక్ నివాసంలోనే తేజస్విని వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగింది. తండ్రి బాటలో తేజస్విని వివేక్‌కు మొక్కలంటే చాలా ఇష్టం.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్న వివేక్.. చెన్నై నగర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కల నాటాడు. తన తండ్రికి ఇష్టమైన కార్యక్రమాన్ని ఇప్పుడు తేజస్విని కూడా కొనసాగిస్తుంది. తన తండ్రి కోరికను నిలబెడుతూ.. తన వంతుగా ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు ఆవిడ తెలిపారు. అందులో భాగంగా వారి వివాహానికి హాజరైన అతిథిలకు తేజస్విని దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తేజస్విని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
'శ్రుతి సంతకమే తరువాయి'
కొత్త సినిమాల్లో నటించే విషయమై కోర్టు వివాదాలు పూర్తిగా సమసిపోయిన నేపథ్యంలో నటి శ్రుతిహాసన్ ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సింగం, సింగం 2 కు సీక్వెల్ గా వస్తోన్న సింగం 3 సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపింది. హీరో సూర్యకు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన సింగం, సింగం 2 తరహాలోనే మూడో సీక్వెల్ నూ పూర్తిస్థాయి యాక్షన్ మాస్ మసాలాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు దర్శకుడు హరి. అనుష్క ప్రధాన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను తీసుకున్నాం. ఇందుకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. అగ్రిమెంట్ పేపర్లమీద శ్రుతి హాసన్ సంతకం చేయడమే మిగిలింది' అని సింగం ఫ్రాంచైంజీ అధికార ప్రతినిధి మీడియాతో అన్నారు. అయితే సింగం సీక్వెల్‌గా సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ కాకుండా సింగం-3కి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందించనున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న సింగం 3 వచ్చే సంక్రాంతికి విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది.