యుద్ధం కోసం సిద్ధం! | Shriya Saran In Balayya's Gautamiputra Satakarni | Sakshi
Sakshi News home page

యుద్ధం కోసం సిద్ధం!

May 29 2016 12:05 AM | Updated on Aug 29 2018 1:59 PM

యుద్ధం కోసం సిద్ధం! - Sakshi

యుద్ధం కోసం సిద్ధం!

భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపొందుతున్న విషయం తెలిసిందే.

భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నూరవ చిత్రం కావడంతో  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శాతకర్ణి భార్య పాత్రకు నయనతార, శ్రీయ పేర్లను పరిశీలిస్తున్నారట. బిబో శ్రీనివాస్ సమర్పణలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల మొరాకోలో పూర్తయింది. మలి షెడ్యూల్‌ను ఈ నెల 30న హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారు.

ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ- ‘‘ ఈ నెల 30న మొదలుపెట్టి, జూన్ 7 వరకూ చిలుకూరి బాలాజీ ఆలయం సమీపంలో చిత్రీకరణ జరుపుతాం. ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరపనున్న షెడ్యూల్ కోసం భారీ యుద్ధనౌక సెట్ వేశారు. ఇంత పెద్ద నౌక సెట్‌ను వేయడం ఇదే తొలిసారి అని నిర్మాతలు తెలిపారు. ఈ సెట్‌లో షూటింగ్ చేయడం కోసం ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో రెండు వందల మంది ఆర్టిస్టులకు కత్తి సాము శిక్షణ ఇప్పిస్తున్నామనీ, అత్యంత భారీ ఎత్తున ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయిమాధవ్, ఆర్ట్: భూపేష్ భూపతి, సహ-నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు.

Advertisement
 
Advertisement
Advertisement