‘పెళ్లి నాది కాదు.. నా ఫ్రెండ్‌ది’ | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 7 2018 11:36 AM

Shriya Saran  - Sakshi

సీనియర్‌ హీరోయిన్‌ శ్రియ శరన్ పెళ్లి మార్చిలో జరగనున్నట్టుగా వార్తలు వినిపించాయి. కొద్ది రోజులుగా ఓ రష్యాన్‌ యువకుడితో సన్నిహితంగా ఉంటున్న శ్రియ అతడినే పెళ్లాడనుందన్న వార్త మీడియా సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు రాజస్థాన్‌లో వీరి వివాహ వేడుక జరగనుందని, ఇప్పటికే ఈ జంట షాపింగ్‌ కూడా మొదలెసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అవన్ని రూమర్ప్ అంటూ కొట్టి పారేసింది శ్రియ.

రాజస్థాన్ లో జరగనున్న తన స్నేహితురాలి వివాహం కోసమే బట్టలు, నగలు ఆర్డర్‌ చేశానని, ఇప్పట్లో తన పెళ్లి ఉండదని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన శ్రియ తల్లి నీర్జ.. ‘రానున్న నెల రోజుల్లో శ్రియ రెండు వివాహా వేడుకల్లో పాల్గొనబోతోంది. వాటికోసం షాపింగ్ చేయటం వల్లే ఈ రూమర్స్‌ పుట్టుకొచ్చాయి’ అని తెలిపారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియ ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నరగసూరన్‌ సినిమాతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.

 
Advertisement
 
Advertisement