బ్యాక్‌ టు వర్క్‌

Shriya joins Naragasooran team - Sakshi

సముద్రంతో స్నేహానికి సెలవు ప్రకటించారు శ్రియ... ప్రస్తుతానికి మాత్రమే అనుకోండి! మొన్నటివరకూ సముద్రంలో తనకిష్టమైన స్కూబా డైవింగ్, స్విమ్మింగ్‌ వంటివి చేస్తూ ఎంజాయ్‌ చేశారీ సుందరి. ఇప్పుడు సరదాలను పక్కను పెట్టి, షూటింగుల్లోకి వచ్చేశారు. తమిళ సినిమా ‘నరగసూరన్‌’లో అరవింద్‌ స్వామి, సందీప్‌ కిషన్, ఇంద్రజిత్‌ సుకుమాన్‌ (మలయాళ హీరో), శ్రియ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

సెలవులకు చెక్‌ పెట్టిన శ్రియ స్ట్రయిట్‌గా ఈ సినిమా షూటింగులో ఎంటరయ్యారు. తమిళంలో విమర్శకులతో పాటు ప్రేక్షకులకు ప్రశంసలందుకున్న ‘డి16’ ఫేమ్‌ కార్తీక్‌ నరేన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. గౌతమ్‌ మీనన్‌ నిర్మాతల్లో ఒకరు. తెలుగులో ‘16: ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌’ పేరుతో విడుదలైన ‘డి16’ మంచి విజయం సాధించింది. ఇప్పుడీ ‘నరగసూరన్‌’నూ తెలుగులో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు రెడీ! ‘నరకాసురుడు’ అనే టైటిల్‌ కూడా ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top