అప్పుడు బాధపడతా | shriya feels flop movies | Sakshi
Sakshi News home page

అప్పుడు బాధపడతా

Published Mon, Sep 3 2018 2:54 AM | Last Updated on Mon, Sep 3 2018 2:54 AM

shriya feels flop movies - Sakshi

శ్రియ

‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్‌’ వంటి చిత్రాల్లో నటించి వెండి తెరపైకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు హీరోయిన్‌ శ్రియ. ఆ తర్వాత ‘ఛత్రపతి, దేవదాసు, శివాజీ’ వంటి హిట్‌ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా దాదాపు 16ఏళ్ల కెరీర్‌ను కంప్లీట్‌ చేశారు. ఇన్నేళ్ల జర్నీలో ఫ్లాప్‌ అయిన సినిమాల గురించి మీరు ఎప్పుడైనా ఫీల్‌ అయ్యారా? అన్న ప్రశ్నను శ్రియ ముందు ఉంచితే– ‘‘నా సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు నేను నిరుత్సాహపడలేదు అని చెబితే అది అబద్ధం అవుతుంది.

ఫెయిల్‌ అయిన కొన్ని సినిమాలు కెరీర్‌పై కూడా బాగా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. అందుకే ఫెయిల్యూర్‌ సినిమాకి చాలా ఫీలవుతాను. సినిమా ఫీల్డ్‌లో తప్పులను కరెక్ట్‌ చేసుకోవడం కష్టం. పుస్తకాలను ఎంచుకున్నంత బాగా నేను స్క్రిప్ట్స్‌ను సెలక్ట్‌ చేసుకోలేను. అలాగే నాకు బాగా కనెక్ట్‌ అయిన వారితోనే నేను ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చారు శ్రియా. ప్రస్తుతం ఆమె చే సిన సినిమాల విషయానికొస్తే సౌత్‌లో ఆమె నటించిన ‘నరగాసురన్, వీరభోగ వసంతరాయలు’, హిందీలో ‘తడ్కా’ మూవీస్‌ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొశ్చివ్‌తో శ్రియ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement