ఆ తప్పు చేయను

Shraddha Kapoor on why 2018 has been a tough year so far - Sakshi

‘‘ఫెయిల్‌ అవ్వడం తప్పు కాదు. కానీ ఆ ఫెయిల్యూర్‌ నుంచి ఓ పాఠం నేర్చుకోకపోవడం తప్పు. నేను ఆ తప్పు చేయను’’ అంటున్నారు కథానాయిక శ్రద్ధా కపూర్‌. సక్సెస్‌ అండ్‌ ఫెయిల్యూర్స్‌ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో గెలుపు ఓటములు సహజం. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. వాస్తవానికి నా తొలి రెండు సినిమాలు ఆడలేదు. అయినా నేను నిరుత్సాహపడలేదు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను ఎలా డీల్‌ చేయాలో నేర్చుకున్నా. సినిమా రిజల్ట్‌ని ఆడియన్స్‌ ఎలాగూ డిసైడ్‌ చేస్తారు.

సో.. ఆ సినిమాకు నేనెంత కష్టపడ్డానని మాత్రమే ఆలోచించుకుంటా. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సవాళ్లకు ఎప్పుడూ సిద్ధమే’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ సినిమాతో కథానాయికగా శ్రద్ధాకపూర్‌ సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు శ్రద్ధా కపూర్‌. ఇక బీటౌన్‌లో ఆమె నటించిన ‘స్త్ర్రీ’ ఈ నెల 31న, ‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’ సెప్టెంబర్‌ 21న విడుదల కానున్నాయి. అటు హిందీ ఇటు తెలుగు సినిమాలతో ఈ బ్యూటీ బిజీ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top