
భారీ అంచనాల నడుమ విడుదలై ‘సాహో’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది.
భారీ అంచనాల నడుమ విడుదలై ‘సాహో’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓ ధియేటర్‌లో ‘యంగ్ రెబల్‌స్టార్’ అభిమానులు చేసిన సందడి వీడియోను హీరోయిన్ శ్రద్ధాకపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. వెండితెర ముందు హుషారుగా ఫ్యాన్స్ నృత్యాలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అయితే ఎక్కడ తీశారనే వివరాలేమి లేవు.
‘ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే సాహో సినిమా తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం కలలా ఉంది. సాహో చిత్ర యూనిట్ రెండేళ్ల పాటు పడిన కష్టానికి రెట్టింపు ప్రతిఫలం రాబోతోందని టీజర్‌కు వచ్చిన స్పందనను బట్టి అర్థమవుతోంద’ని శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు. గురువారం విడుదలైన సాహో టీజర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేసిన టీజర్‌కు ఒక్క రోజుల్లో యూట్యూబ్‌లో 5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.