మహేష్ కట్ చేయమన్నాడు | short run time for Mahesh babu brahmotsavam | Sakshi
Sakshi News home page

మహేష్ కట్ చేయమన్నాడు

May 18 2016 10:53 AM | Updated on Oct 30 2018 5:58 PM

మహేష్ కట్ చేయమన్నాడు - Sakshi

మహేష్ కట్ చేయమన్నాడు

శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ వెండితెర మీద బ్రహ్మోత్సవానికి రెడీ అవుతున్నాడు. పీవీపీ సినిమాస్ సంస్థ భారీ...

శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం టాలీవుడ్ వెండితెర మీద బ్రహ్మోత్సవానికి రెడీ అవుతున్నాడు. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల తన సినిమాల మేకింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న మహేష్, బ్రహ్మోత్సవం విషయంలో కూడా అదే కేర్ తీసుకుంటున్నాడు.

సాధారణంగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కే సినిమాలు రెండున్నర గంటలకు పైగానే ఉంటాయి. భారీ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ సరైన ఇంపార్టెన్స్ ఇవ్వటం కోసం లెంగ్త్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తారు చిత్రయూనిట్. అయితే బ్రహ్మోత్సవం విషయంలో మాత్రం మహేష్ అలా వద్దన్నాడట. ప్రస్తుతం ఆడియన్స్ మరీ ఎక్కువ సేపు థియేటర్లతో కూర్చునేందుకు ఆసక్తి చూపించటం లేదని, అందుకే ఈ సినిమాను 2 గంటల 20 నిమిషాలోనే ముగించేయాలని సూచించాడు. అందుకు అంగీకరించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొన్ని కామెడీ సీన్స్ను తగ్గించే ఆలోచనలో ఉన్నాడు.

గతంలో శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుల కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో కూడా మహేష్ ఇలాంటి సూచనలే చేశాడట. ఆ సినిమా రిజల్ట్ పాజిటివ్గా రావటంతో మరోసారి మహేష్ మాట విని సినిమా నిడివి తగ్గించారు. మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో చాలా మంది సీనియర్ నటులు కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement