అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా! | Shooting romantic scenes with Nawazuddin Siddiqui 'difficult' | Sakshi
Sakshi News home page

అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా!

Jul 21 2015 12:15 AM | Updated on Sep 3 2017 5:51 AM

అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా!

అతనితో కెమిస్ట్రీ గురించి భయపడ్డా!

నవాజుద్దీన్ సిద్దిఖీ...వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఏ పాత్రనైనా మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేస్తారని విమర్శకులు, ప్రేక్షకుల అభిప్రాయం.

 నవాజుద్దీన్ సిద్దిఖీ...వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్.  ఏ పాత్రనైనా మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేస్తారని విమర్శకులు, ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి నవాజ్ ఇటీవల ఓ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట. నవాజుద్దీన్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న చిత్రం ‘మాంఝీ’. తన భార్యలాగే ఇంకెవరూ చనిపోకూడదన్న కారణంతో కేవలం ఓ సుత్తితో 22 ఏళ్ల పాటు కొండను తవ్వి రోడ్డును నిర్మించిన దశరథ్ మాంఝీ అనే  వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
  ఈ చిత్రంలో రొమాన్స్‌కు చాలా ప్రాధాన్యం ఉందట. దర్శకుడు కేతన్ మెహతా ఈ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించే సమయానికి నవాజ్ చాలా సెలైంట్ అయిపోయేవారట. ఈ విషయమై రాధికా ఆప్టే మాట్లాడుతూ -‘‘రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మాకు దూరంగా ఒంటరిగా కూర్చునేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటివరకూ బాగానే ఉన్నారు. సడన్‌గా ఏమైందా...? అని. నాకేమో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందా లేదా అని భయం. కానీ యాక్షన్ చెప్పగానే సీన్‌లో లీనమైపోయేవారు’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement