శశికపూర్‌ చనిపోతే శశిథరూర్‌కు ఫోన్స్‌.! | Shashi Kapoor Dies, Shashi Tharoor Gets Condolence Calls | Sakshi
Sakshi News home page

శశికపూర్‌ చనిపోతే శశిథరూర్‌కు ఫోన్స్‌.!

Dec 5 2017 10:58 AM | Updated on Dec 5 2017 12:06 PM

Shashi Kapoor Dies, Shashi Tharoor Gets Condolence Calls - Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు శ‌శిక‌పూర్ సోమవారం మృతి చెందారు. అనారోగ్య కార‌ణాల‌తో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్యాస విడిచిన విషయం తెలిసిందే. అయితే టైమ్స్‌ నౌ చానెల్‌ అత్యుత్సాహం కాంగ్రెస్ సీనియర్‌ నాయ‌కుడు శ‌శిథరూర్‌ను ఇబ్బందులకు గురిచేసింది. శ‌శిక‌పూర్‌కు బదులు శ‌శిథ‌రూర్ మృతి చెందిన‌ట్లు సదరు టీవీ చానెల్ ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొంది. దీంతో శ‌శిథ‌రూర్ అభిమానులు ఆయ‌న ఆఫీసుకు కాల్ చేశారు. దీంతో అస‌లు విష‌యం తెలుసుకున్న ఆయన ట్విట్టర్‌ లో స్పందించారు. 

‘శశికపూర్‌ చనిపోవడం బాధాకరమైన విషయం. కొంత మంది నేను మరణించినట్లు భావించారు. నా కార్యాల‌యానికి సోమ‌వారం ఉద‌యం నుంచి ఫోన్సు వ‌చ్చాయి. కొంత మంది జ‌ర్నలిస్టులు కూడా ఫోన్ కాల్స్ చేసి తన ఆరోగ్య విష‌యం గురించి తెలుసుకున్నారు. నాకేం కాలేదు. శశికపూర్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

ఇక తప్పును గుర్తించిన టైమ్స్‌నౌ చానెల్‌ శశిథరూర్‌ను క్షమాణలు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement