ఈ సారి మహేష్, ఎన్టీఆర్లతో..! | Sharwanand To Fight With Biggies | Sakshi
Sakshi News home page

ఈ సారి మహేష్, ఎన్టీఆర్లతో..!

Aug 15 2017 2:23 PM | Updated on Sep 17 2017 5:33 PM

ఈ సారి మహేష్, ఎన్టీఆర్లతో..!

ఈ సారి మహేష్, ఎన్టీఆర్లతో..!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరోసారి రిస్క్ చేస్తున్నాడు. వరుసగా రెండు సార్లు సంక్రాంతి బరిలో సీనియర్ స్టార్ హీరోలతో

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరోసారి రిస్క్ చేస్తున్నాడు. వరుసగా రెండు సార్లు సంక్రాంతి బరిలో సీనియర్ స్టార్ హీరోలతో పోటిపడ్డ శర్వా.. ఈ సారి దసరా బరిలో అదే ఫీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలను సంక్రాంతి సీజన్ లో ఎదుర్కొన్న ధైర్యంతో దసరా బరిలో మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో తలపడుతున్నాడు.

ప్రస్తుతం శర్వానంద్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానుభావుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఇప్పటికే దసరా బరిలో జై లవ కుశ, మహేష్ బాబు స్పైడర్ సినిమాలు దసరా బరిలో పోటీ పడుతున్నాయి. ఇంతా భారీ కాంపిటీషన్ లో శర్వా తన సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు.

Advertisement
 
Advertisement
Advertisement