‘శరభ’ ఫస్ట్‌ సింగిల్‌ | Sharabha Movie First Single Released | Sakshi
Sakshi News home page

May 8 2018 12:10 PM | Updated on May 8 2018 12:25 PM

Sharabha Movie First Single Released - Sakshi

బాహుబలి సక్సెస్‌ తరువాత సోషియో ఫాంటసీ సినిమాలకు ఆధారణ పెరిగింది. అదే బాటలో తెరకెక్కుతున్న మరో గ్రాఫికల్‌ వండర్‌ శరభ. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ‘శరభ’ పోస్టర్‌ రిలీజ్‌ చేయించారు మేకర్స్‌. దీంతో ‘శరభ’ సినిమాపై టాలీవుడ్‌ లో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. చాలా ఏళ్ల తరువాత జయప్రద ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో ఆకాశ్‌ కుమార్‌ సహదేవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. 

తాజాగా శరభ సినిమాలోని ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ అనే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు కోటి స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్‌ సాహిత్యాని​ అందించారు. హేమచంద్ర పాడిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. మిస్తీ చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అశ్విని కుమార్‌ సహదేవ్‌ నిర్మాతగా వ్యవహరించగా, నర్సింహా రావు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 1న శరభ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement