రోబో 2 ట్రైలర్ ఎప్పుడంటే.? | Shankar, RajiniKanth Robo 2 trailer Release Date | Sakshi
Sakshi News home page

రోబో 2 ట్రైలర్ ఎప్పుడంటే.?

Mar 12 2017 12:38 PM | Updated on Sep 5 2017 5:54 AM

రోబో 2 ట్రైలర్ ఎప్పుడంటే.?

రోబో 2 ట్రైలర్ ఎప్పుడంటే.?

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా 2.0. శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా 2.0. శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కిన రోబోకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే 400 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఒక పాట మినహా మిగతా భాగం షూటింగ్ పూర్తి చేస్తున్న రోబో 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ను కన్ఫామ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న రోబో 2 అఫీషియల్ ట్రైలర్ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాణాంతర కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందుకే షూటింగ్ తరువాత 6 నెలలకు పైగా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్కే కేటాయించారు. ట్రైలర్ రిలీజ్ అయిన నెల తరువాత అక్టోబర్ లో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement