‘భారతీయుడు-2’ షూటింగ్‌ వాయిదా!

Shankar And Kamal Haasan Indian 2 Movie Shooting May Postponed - Sakshi

‘2.ఓ’లాంటి గ్రాఫిక్స్‌ మాయాజాలం తరువాత శంకర్‌ మరో ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందోప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ ను శంకర్‌ రూపొందిస్తున్నారు.

పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ చిత్రయూనిట్‌.. అకస్మాత్తుగా షూటింగ్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది. అక్కడ వేసిన సెట్‌లు శంకర్‌కు సంతృప్తినివ్వలేదని, మళ్లీ సెట్‌ను రీక్రియేట్‌చేసేవరకు షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top