అవకాశాల బాటలో అర్జున్‌రెడ్డి హీరోయిన్‌ | shalini pandey 3rd movie in kollywood | Sakshi
Sakshi News home page

అవకాశాల బాటలో అర్జున్‌రెడ్డి హీరోయిన్‌

Dec 25 2017 5:51 PM | Updated on Dec 25 2017 7:34 PM

shalini pandey 3rd movie in kollywood - Sakshi

సాక్షి, సినిమా: టాలీవుడ్‌లో తొలి సినిమా అర్జున్‌రెడ్డితోనే సంచలన విజయాన్ని అందుకున్న జైపూర్‌ బ్యూటీ శాలినిపాండే. ఆ సినిమా విజయం ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. తెలుగులో ఘనవిజయం సాధించిన 100 % లవ్‌ రీమేక్‌ ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శాలినిపాండే ఈ చిత్రంలో జీవీ. ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్‌ చేస్తోంది.  ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం నటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నడిగైయార్‌ తిలగంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. అదే విధంగా మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. 

తాజాగా కోలీవుడ్‌లో మూడో చిత్రానికి రెడీ అవుతోంది. ఇందులో నటుడు జీవాకు జంటగా నటించనుంది. ఇది జీవీకు 29వ చిత్రం. దీనికి డాన్‌ శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆల్‌ ఇన్‌ ఫిక్చర్స్‌ పతాకంపై విజయ రాఘవేంద్ర భారీ బడ్జెట్‌లో నిర్మించనున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నటుడు జీవా ఇప్పటి వరకూ నటించనటువంటి వైవిధ్యంతో కూడిన కామెడీ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శాలినిపాండే పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రీ ప్రొడక‌్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. విక్రమ్‌వేదా చిత్రం ఫేమ్‌ శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద నటి శాలినిపాండే కోలీవుడ్‌లో మూడో చిత్రానికి సిద్ధం అయిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement