బ్లాక్‌ బస్టర్స్‌ లిస్ట్‌లో శంకర ఉంటుంది – సురేశ్‌ కొండేటి

Shakalaka Shankar Shambo Shankara  movie updates - Sakshi

‘‘ఈ సినిమాకు ఫస్ట్‌ టెక్నీషియన్‌ సాయికార్తీక్‌గారే. ఆయన తర్వాతే మిగిలిన టెక్నీషియన్స్‌ అందరూ సెట్‌ అయ్యారు. మా అందరి ఆరు నెలల కష్ట ఫలితమే ఈ సినిమా. శంకర్‌ హీరో ఏంటి? అని అనుకునేవాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది. సినిమా చూస్తే శంకర్‌తో ఎందుకు తీశామో అర్ధమవుతుంది. నిర్మాతల్లో ఒకరైన రమణారెడ్డిగారి వల్లే ఈ సినిమా అవుట్‌పుట్‌  బాగా వచ్చింది. నాకు తెలిసి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్స్‌ లిస్టులో ‘శంభో శంకర’ ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్‌ పూర్తయ్యింది. అందరి నమ్మకం ఫలిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సురేశ్‌ కొండేటి. శ్రీధర్‌ దర్శకత్వంలో షకలక శంకర్‌ హీరోగా ఆర్‌.ఆర్‌. పిక్చర్స్‌ , యస్‌కే పిక్చర్స్‌ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేశ్‌ కొండేటి నిర్మించిన చిత్రం ‘శంభో శంకర’. జూన్‌ 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ విడుదల చేయగా హీరో శంకర్‌ మొదటి సీడీని అందుకున్నారు.

శ్రీధర్‌ మాట్లాడుతూ –‘‘మాటల రచయిత భానుప్రసాద్‌ గారు చాలా మంచి డైలాగ్స్‌ ఇచ్చారు. సినిమా కోసం ఏమైనా ఫర్వాలేదని శంకర్‌ ప్రాణం పెట్టి చేశారు. అందరూ  ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  హీరో శంకర్‌ మాట్లాడుతూ –‘‘దర్శ కులు శ్రీధర్‌కు, నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయముంది. మాకు సినిమాల మీద ఆసక్తి కలిగేలా చేసింది నటి నిర్మలమ్మగారు. ఆవిడ వల్లే మేం సినిమా జీవితం గురించి తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్పటికీ మాపై ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాను మొదట ‘దిల్‌’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌ గార్ల దగ్గరికి తీసుకెళ్లాను. వారు చేస్తామన్నారు, కానీ రెండేళ్లు ఆగాలన్నారు. మా బాధను నెల్లూరులోని రమణారెడ్డిగారు అర్థం చేసుకున్నారు. అలాంటి నిర్మాతలుంటే నాలాంటి ఎందరో హీరోలుగా, శ్రీధర్‌ లాంటి వారెందరో దర్శకులు అవుతారు. నేను నటునిగా పది రూపాయలు సంపాదిస్తే అందులో ఎనిమిది రూపాయలు కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చేస్తాను. ఈ నెల 29 మేమంతా ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుస్తుంది’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top