నిర్మాత సురేష్ కొండేటి, అక్సాఖాన్ సినిమా గ్లింప్స్‌ విడుదల | Suresh Kondeti Abhimani Movie Glimpse Out Now | Sakshi
Sakshi News home page

నిర్మాత సురేష్ కొండేటి, అక్సాఖాన్ సినిమా గ్లింప్స్‌ విడుదల

Oct 7 2024 4:57 PM | Updated on Oct 7 2024 6:23 PM

Suresh Kondeti Abhimani Movie Glimpse Out Now

నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే 'దేవినేని' అనే సినిమాతో కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన 'అభిమాని' అనే మరో కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిమాని  ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‍లైన్ తో సినిమా తెరకెక్కింది. ఇందులో సురేష్‌ కొండేటి సరసన అక్సాఖాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‍కే రహ్మాన్, మరియు కంద సాంబశివరావు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

గ్లింప్స్‌ విడుదల సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..  'అభిమాని సినిమా  గ్లింప్స్ చాలా బాగుంది. టైటిల్‌ సెలక్షన్‌తోనే  సినిమా సగం విజయం సాధించింది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం.' అని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement