మరో రీమేక్‌

Shahid Kapoor to star in Hindi remake of Nani Jersey - Sakshi

సౌత్‌లో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు బాలీవుడ్‌ రీమేక్‌కి దారి ఇస్తున్నాయి. ఆ దారిలో బాలీవుడ్‌కు వెళ్తున్న చిత్రం ‘జెర్సీ’. నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాను ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు సూపర్‌ అన్నారు. ఇప్పుడు ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నాని పాత్రను షాహిద్‌ కపూర్‌ చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ రీమేక్‌ని కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు. అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు, అమన్‌ గిల్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 28న ఈ సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. షాహిద్‌ గత చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ తెలుగు ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌ అని తెలిసిందే. తన కెరీర్‌ బెస్ట్‌ హిట్‌గా ‘కబీర్‌ సింగ్‌’ సినిమా నిలిచింది. ఇప్పుడు ‘జెర్సీ’ రీమేక్‌ తన హిట్‌ ట్రాక్‌ని కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top