‘జెర్సీ’ రీమేక్‌లో ‘కబీర్‌ సింగ్‌’

Shahid Kapoor to Star in Hindi Remake of Jersey - Sakshi

నేచురల్‌ స్టార్ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌ సాధించినా వసూళ్ల పరంగా వెనకపడింది. అయితే నాని నటన, గౌతమ్‌ టేకింగ్‌ మాత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.

తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ కన్ను ఈ సినిమాపై పడింది. ఇప్పటికే కరణ్‌  జెర్సీ రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఒరిజినల్‌ వర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే రీమేక్‌ను కూడా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట కరణ్‌. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న షాహిద్, మరో తెలుగు సినిమా రీమేక్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top